Monday, December 23, 2024

9 ఏండల్లో తెలంగాణ అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

గంభీరావుపేట: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో అభివృద్ధి చెందిందని నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు అన్నారు. దశాబ్ది ఉత్సవాలు విజయవంతంగా పూర్తైన సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని సహకార సంఘ భవనంలో మండల స్థాయి నాయకులతో కలసి సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా 9 ఏండ్లలో రాష్ట్రం అన్ని హంగులతో అభివృద్ధి చెందిందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో నాయకులు,వివిధ శాఖల అధికారులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసి నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర విభజన 2014 పూర్వం, 2014 విభజన తర్వాత రాష్ట్రంలో అద్భుతం జరిగి ఎంతో అభివృద్ధి జరిగిందని అందుకు నేనే సాక్షం అన్నారు. విభజనకు ముందు సహకార సంఘాలలో ఎన్నో మార్పులు జరినట్లు తెలిపా రు. జిల్లా వ్యాప్తంగా సహకార సంఘంలో 600లకు లావాదేవీలు నేడు 6వేల కోట్లకు లావాదేవీలు చేరుకుందన్నారు.

ఈ కా ర్యక్రమంలో బీఆర్‌ఎస్ మండలశాఖ అధ్యక్షులు పాపాగారి వెంకటస్వామి గౌడ్,పట్టణ అధ్యక్షులు వెంకటి యాదవ్,వైస్ ఎంపిపి దోశల లత,ఉపసర్పంచ్ నాగరాజు గౌడ్,నాయకులు రెడ్డిమల్ల రాజనర్సు,వాహిద్,ఎగదండి స్వామి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News