Monday, December 23, 2024

మనదిక.. ఆరోగ్య తెలంగాణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజారోగ్య పరిరక్షణ, వైద్యారోగ్య రంగాభివృద్ధి దిశగా రా ష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన చర్యలతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ‘ఆరోగ్య తెలంగాణ’గా అవతరించిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. పచ్చని పంటలు చక్కని వాతావరణంతో ప్రకృతి రమణీయతతో అలరారుతున్న తెలంగాణలో రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (ఏప్రిల్ 07) సందర్భంగా సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు. వైద్యారోగ్య రంగం లో తెలంగాణ సాధించిన పురోగతిని, అమలు చేస్తున్న ప లు పథకాలను తద్వారా ప్రజలకు అందుతున్న వైద్యం, మె రుగుపడుతున్న ప్రజల ఆరోగ్యం గురించి ఈ సందర్భంగా ఆయన వివరించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే కరువైన నాటి ఉమ్మడి పాలన నాటి గడ్డు పరిస్థితుల నుంచి నేడు తెలంగాణలో జిల్లాకో వైద్య విద్యా, పారా మెడికల్, నర్సిం గ్ కాలేజీలను స్థాపించుకునే దశకు చేరుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం వైద్యారోగ్యరంగంలో సాధించిన ప్రగతి దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు.మెడికల్ కాలేజీల సీట్లు భారీగా పెంపు, ప్రభుత్వ దవాఖానలు, మెడికల్, నర్సింగ్ కాలేజీల్లో అవసరాలకు అనుగుణంగా సిబ్బంది నియామకం చేపట్టడం ద్వారా వై ద్యం సామాన్యుడికి చేరువయిందన్నారు. సాధారణ బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్ బెడ్ల సంఖ్య పెంపు, ప్రతి ఆసుపత్రిలో అన్నిరకాల వైద్య పరికరాలు, మందులు, ల్యాబొరేటరీల ఏర్పాటుతో ప్రజావైద్యంలో గుణాత్మక మార్పు చోటు చేసుకున్నదన్నారు.

హైదరాబాద్‌తో సహా వరంగల్ లాంటి ముఖ్యపట్టణాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పటళ్ల ని ర్మాణం తో ప్రభుత్వ వైద్యసేవల్లో కార్పోరేట్ వైద్యం అందబోతున్నదన్నారు. నగరంలోని నిమ్స్ హాస్పటల్‌ను అదనం గా 2500 పడకలతో విస్తరించడంతో పాటు, వరంగల్ లో అన్ని వైద్య సదుపాయాలు ఒకే చోట లభ్యమయ్యే విధంగా ‘మెడికల్ హబ్’గా తీర్చిదిద్దుతున్నట్లు సిఎం తెలిపారు. నా ణ్యమైన వైద్య సేవలు, వైద్య సదుపాయాల విస్తరణ, నిరంతర పర్యవేక్షణతో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని అమలుచేస్తున్న కుటుంబ సంక్షేమ పథకాలు, కెసిఆర్ కిట్, కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లు, ఆరోగ్య లక్ష్మీ, అమ్మఒడి, ఆరోగ్య మహిళ (ప్రత్యేక మహిళా క్లినిక్‌లు) వంటి పథకా లు తెలంగాణ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక భాగస్వా మ్యం వహిస్తున్నాయని సిఎం తెలిపారు. బస్తీ దవాఖానా లు, పల్లె దవాఖానాలు, తెలంగాణ డయాగ్నస్టిక్స్, ఆరోగ్య శ్రీ, ఎంప్లాయిస్ అండ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం, ఉచిత డయాలసిస్ కార్యక్రమం,

108 అత్యవసర ఆరోగ్య రవాణా సేవలు, పాలియేటివ్ కేర్, కంటి వెలుగు పథకం కింద మొదటి దశలో 1 కోటి మందికి పరీక్షలు, 40 లక్షల మందికి కంటి అద్దాలు, రెండవ దశలో 1 కోటికి పైగా ఉచితంగా కంటి పరీక్షలు, 29 లక్షల మందికి ఉచితంగా అద్దాల పంపిణీ చేస్తూ పేదల, మహిళల, బడుగు బలహీన వర్గాలతో సహా ప్రజలందరికీ నాణ్యమైన వైద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. కేంద్రం ప్రకటించిన అన్ని ఆరోగ్య సూచికల్లో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయి కంటే మెరుగ్గా ఉండడం స్వరాష్ట్రంగా తెలంగాణ సాధించిన ఘనతను చాటుతున్నాయని సిఎం పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన హెల్త్ ఫిట్‌నెస్ కాంపెయిన్‌లో 3 కేటగిరీల్లో అవార్డులు ప్రకటించగా, తెలంగాణ రాష్ట్రం 3 కేటగిరీల్లోనూ అవార్డులు సాధించడంతో పాటు, నీతి ఆయోగ్ విడుదల చేసిన 4వ ఆరోగ్య సూచీల్లో 3 వ స్థానాన్ని సాధించిన విషయాన్ని సిఎం కెసిఆర్ గుర్తు చేసుకున్నారు.

అదే విధంగా కేంద్ర ఆర్థిక సర్వే 2022…- 2023 ప్రకారం దక్షిణ భారతదేశంలో ప్రజావైద్యంపై చేస్తున్న ఖర్చులో ప్రభుత్వ వాటా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో నిలవడంతో పాటు, వైద్యం కోసం చేసే ఖర్చులో ప్రజల పై తక్కువ భారం పడుతున్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో నిలవడం, ప్రసూతి మరణాల రేటు తగ్గింపులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 3వ స్థానంలో నిలవడం …. ప్రజారోగ్యం పై ప్రభుత్వానికున్న నిబద్ధతను స్పష్టం చేస్తున్నదన్నారు. రానున్న రోజుల్లోనూ ఇదే ఒరవడిని కొనసాగించి దేశంలోనే గొప్ప వైద్యం అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని సిఎం అన్నారు. ఇప్పటికే దేశ విదేశాలనుంచి ఆరోగ్య పరీక్షలు ప్రత్యేక వైద్యం కోసం హైదరాబాద్ కు తరలివస్తున్న నేపథ్యంలో తెలంగాణ మెడికల్ హబ్ గా ఘనత సాధించిందన్నారు. ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ వైద్యారోగ్య రంగాన్ని భవిష్యత్తులో మరింతగా బలోపేతం చేస్తామని సిఎం కెసిఆర్ గురవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News