- మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు
రాయపర్తి: సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్లూఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.
రాయపర్తి మండలం కొండాపురం గ్రామానికి చెందిన కొందరు బీఆర్‌ఎస్ నాయకులు నిన్న కాంగ్రెస్‌లో చేరగా బుధవారం మంత్రి ఎర్రెబల్లి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారిలో కూరపాటి ముత్తయ్య, మేడి వెంకన్న, గాదె కుమారస్వామి, గాదె వెంకటయ్య, గాదె యాకయ్య, కూరపాటి మధు, మేడి రవి, గాదె సుగుణమ్మ, కూరపాటి సంజీవ, కూరపాటి ఉప్పలమ్మ, గన్నరం మహేందర్, గాదె వెంకన్న, చెన్నాబాల్లి పార్వతి, కూరపాటి ఐలయ్య, ముత్తమ్మ, దేవరాజ్‌లకు మంత్రి ఎర్రబెల్లి గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో వారికి సముచిత గౌరవం ఉంటుందన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి పాలుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రంగు కుమార్‌గౌడ్, గ్రామ పార్టీ ఇన్‌ఛార్జి గుగులోతు జాజు నాయక్, స్థానిక సర్పంచ్ కోదాటి దయాకర్‌రావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు తెరల యాకయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.