Monday, December 23, 2024

సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

మణుగూరు : సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ప్రభుత్వ విప్, పినపాక శాసన సభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం మణుగూరులోని ఎంఎల్‌ఏ క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

అనేక పోరాటాలు త్యాగాలు బలిదానాలతో పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్దతుల పోరాడి సాధించుకున్న తెలంగాణలో సిఎం కెసిఆర్ నాయకత్వంలో అన్ని రంగాలలో దూసుకువెళ్తున్నామని అన్నారు. అనతి కాలంలోనే ధృడమైన పునాదులతో సుస్థిరతను చేకూర్చినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉన్నదన్నారు. తెలంగాణ ప్రభుత్వం నాటి ఉద్యమ నినాదాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నదన్నారు. సిఎం కెసిఆర్ సహకారంతో జిల్లాలో సాగునీరు తాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం, రోడ్లు తదితర మౌలిక వసతులను సంకల్ప దీర్ఝకాలిక లక్ష్యాలతో కల్పన చేసుకుంటూ వస్తున్నామన్నారు.

ఆసరా పెన్షన్లలో రాష్ట్రం ఆల్ టైం రికార్డు సృష్టించిందని, పేద కుటుంబాలకు అండగా ఉంటూ వారి సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేటి నుంచి 22వ తారీకు వరకు దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తూ ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్తామని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో దూసుకుపోతున్నదన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్షంగా సిఎం కెసిఆర్ పాలన కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News