Monday, December 23, 2024

బిఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే ఆలయాల అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

బోధన్: బిఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి జరుగుతోందని బోధన్ ఎంఎల్‌ఏ షకీల్ ఆమేర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం బోధన్ పట్టణంలోని శ్రీ ఏకచక్రేశ్వర శివాలయంలో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడతూ ఇప్పటివరకు దేవాలయాల్లో దూపదీప నైవేద్యాలు నిర్వహించడానికి ప్రభుత్వం తరఫున 71 ఆలయాల్లో అర్చకులను నియమించడం జరిగిందన్నారు. అర్చకులకు గౌరవ వేతనం మరో 4వేల రూపాయలను పెంచి రూ.10వేలు అందిస్తున్నట్లు వెల్లడించారు. బోధన్ నియోజకవర్గంలో నిర్మిస్తున్న 71 ఆలయాలకు 20 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. 27 ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్న అర్చకులకు నియామకపత్రాలను అందజేశారు.

ఇందుకగాను ఆలయాల అర్చకులు ఎంఎల్‌ఏ షకీల్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. శాలువలతో ఎంఎల్‌ఏను వారు ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో శివాలయం ఛైర్మన్ బీర్కూర్ శంకర్, ఎఎంసి ఛైర్మన్ విఆర్‌దేశాయ్, ఎడపల్లి ఎంపిపి కొండెంగల శ్రీనివాస్, కౌన్సిలర్లు బెంజర్ గంగారాం, దూప్‌సింగ్ నాయక్, నక్క లింగారెడ్డి, ఆలయ కమిటీ ఈఓ రాములు, ఆలయ కమిటీ సభ్యులు , బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రముఖులు మహిళలు స్థానికులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News