Friday, November 15, 2024

బిఆర్‌ఎస్ పాలనలో గిరిజన తండాల అభివృద్ధి

- Advertisement -
- Advertisement -
  • పలు గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి భూమి పూజ

నర్సాపూర్: బిఆర్‌ఎస్ పాలనలో గిరిజన తండాలు, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. శనివారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా, నర్సాపూర్ మండల పరిధిలోని నారాయణపూర్ గ్రామంలో, 12 లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని. మండల పరిధిలోని ఎల్లారెడ్డి గూడ తండా, రంజాతాండా తుల్జరంపేట్ తండాలకు ఎస్టిఎస్‌డిఎఫ్ నిధుల నుంచి, ఒక్కో గ్రామపంచాయతీ భవనానికి 20 లక్షలు మంజూరు అయ్యాయి. అదేవిధంగా తిరుమలాపూర్, మంతూర్, మహ్మదాబాద్, ఆద్మాపూర్, గుడెం గడ్డ. గ్రామా పంచాయతీలకు ఎంజిఎన్‌ఆర్ విధుల నుండి ఒక్కో గ్రామపంచాయతీకి 20 లక్షలు మంజూరు కాగా ఆయా గ్రామాలను ఎమ్మెల్యే మదన్ రెడ్డి పర్యటించి, మహిళ కమిషన్ చైర్‌పర్సన్ సునీతారెడ్డితో కలిసి పంచాయతీ భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు.

అనంతరం తుల్జారంపేట్ తండాలో నిర్వహించిన గిరిజన దినోత్సవంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ గిరిజనులను రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి పరచాలనె ఉద్దేశంతో గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా తీర్చి దిద్దిన ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం వల్ల ప్రతి గ్రామపంచాయతీలో గిరిజనులే సర్పంచులుగా ఉన్నారని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నర్సాపూర్ నియోజకవర్గంలో, ప్రతి గిరిజన తండాకు బిటి రోడ్లు. సిసి రోడ్లు వేయడంజరిగిందన్నారు. గిరిజనుల అభివృద్ధి ధ్యేయంగా బిఆర్‌ఎస్ పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పి కోఆప్షన్ సభ్యులు మన్సూర్, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ రాజు యాదవ్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ శివకుమార్ ,మండల పార్టీ అధ్యక్షుడు భోగచంద్రశేఖర్, సర్పంచుల పోరం మండల అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, సర్పంచులు సేనాధిపతి ,లావణ్య రవి, కరుణాకర్, కృష్ణ అంజలి వెంకన్న, సంతోషా బిక్యా నాయక్ ,పద్మశంకర్ నాయక్, నాయకులు పంబల బిక్షపతి ,ఆంజనేయులు గౌడ్, తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News