Thursday, December 26, 2024

దేశాభివృద్ధిలో గ్రామాల అభివృద్ధి కీలకం

- Advertisement -
- Advertisement -

ములుగు: దేశాభివృద్ధిలో గ్రామాల అభివృద్ధి కీలకమని, ప్రజా భాగస్వామ్యంతో పల్లెల్లో మరింత అభివృద్ధి సాధ్యమని జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వెంకటాపూర్ మండలం నల్లగుంట్ల గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గురువారం తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవంలో ఏర్పాటుచేసిన గ్రామసభలో జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుండి అభివృద్ధి చేసే ఆలోచనతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల స్వరూపాన్ని పూర్తిగా మార్చిందని అన్నారు. గ్రామాలలో కళ్యాణలక్ష్మి, షాధీముబారక్, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కెసిఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మి, నిరంతర విద్యుత్ సరఫరా, రెసిడెన్షియల్ పాఠశాలలు వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ప్రతి గ్రామంలో ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ ఏర్పాటుచేసి ప్రతి రోజు చెత్త సేకరణ చేయడంతో ప్రజల ఆరోగ్య ప్రమాణాలు మెరుగపడ్డాయని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్మశానవాటిక, డంపింగ్‌యార్డు ఏర్పాటుతో పాటు నర్సరీ, పల్లె ప్రకృతి వనం ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు. గ్రామాల అభివృద్ధ్దిలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యం చాలా కీలకమని, గ్రామాలలో ప్రభుత్వం అందించిన మౌలిక వసతులను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటు పరిశుభ్రమైన పచ్చదనంతో కూడిన గ్రామాల ఏర్పాట్లు ప్రజలంతా సంపూర్ణంగా భాగస్వామ్యం అవుతూ తమ సంపూర్ణ సహకారం అందించాలని తెలిపారు. అనంతరం పారిశుధ్య సిబ్బందికి శాలువాతో సత్కరించి దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిపిఓ వెంకయ్య, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News