Wednesday, January 22, 2025

దేశాభివృద్ధిలో గ్రామాల అభివృద్ధి కీలకం

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్: దేశాభివృద్ధిలో గ్రామాల అభివృద్ధి కీలకమని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో గురువారం పల్లె ప్రగతి దినోత్సవం పురస్కారించుకోని జిల్లాలోని రెబ్బెన మండలంలోని ఇందిరానగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కారించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచి అభివృద్ధి చేసే ఆలోచనతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల స్వరూపాన్ని పూర్తిగా మార్చిందన్నారు. గ్రామాలలో కళ్యాణలక్ష్మి, షాదిముబారక్, రైతుబంధు, రైతుభీమా, ఆసరా పెన్షన్లు, కేసిఆర్ కిట్, ఆరోగ్యల క్ష్మి, నిరంతర విద్యుత్ సరఫరా, రెసిడెన్షియల్ పాఠశాల వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు.

ప్రతి గ్రామం లో ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ ఏర్పాటు చేసి ప్రతిరోజు చెత్త సేకరణ చేయడంతో ప్రజల ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడ్డాయని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్మశానవాటిక, డంపింగ్‌యార్డు ఏర్పాటుతో పాటు నర్సరీ, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

ప్రభుత్వం ప్రజల కోసం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి ప్రజలకు అందించేందుకు ప్రతి గ్రా మపంచాయతీకి కార్యదర్శిని నియమించడం జరిగిందని, గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం, మిషన్ భగీరథ కార్యక్రమం ద్వా రా ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇచ్చి, తాగునీటిని సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు.

గ్రామాల అభివృద్ధిలో ప్రభుత్వం తీసుకుం టున్న చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యం చాలా కీలకమని, గ్రామాలలో ప్రభుత్వం అందించిన మౌళిక వసతులను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ పరిశుభ్రమైన పచ్చదనంతో కూడిన గ్రామాల ఏర్పాట్లు ప్రజలంతా సంపూర్ణంగా భాగస్వామ్యం అవుతూ తమ సంపూర్ణ సహాకారం అందించాలని తెలిపారు. పల్లె ప్రగతి దినోత్సవాన్ని పురస్కారించుకోని జిల్లా కేంద్రంలోని గ్రామపంచాయతీ కా ర్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్‌భాజ్‌పాయ్ జాతీయ జెండాను ఆవిష్కారించారు.

ఆసిఫాబాద్ మండలం మాణిక్‌గూడ గ్రా మపంచాయతీలో పల్లె ప్రగతి దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని, అనంతరం కెరమెరి మండలంలోని ఝారి గ్రామపంచాయతీ భవనం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం పెం పొందించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాల ద్వారా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల ఆధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News