Thursday, January 23, 2025

సమష్టి కృషితోనే గ్రామల అభివృద్ధి: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

పటాన్ చెరు: సమష్టి కృషితేనే తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధి చెందుతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తునానాయని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ముత్తంగి గ్రామంలో రూ.1 కోటి 50 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ భూపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఉపేందర్‌లతో కలసి ప్రారంభించారు.అనంతరం రూ. 20 లక్షలతో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత గ్రామల అభివృదికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం చిన్న మండలాల ఏర్పాటే కాకుండా తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

నియోజకవర్గంలో పురాతన గ్రామ పంచాయతీల స్థానంలో నూతన పంచాయతీ భవనాల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామ పంచాయతీలకు బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో మహర్దశ వచ్చిందన్నారు. ప్రతి గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్టుగా చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీకి గ్రామ జనాభ ప్రకారం నిధులు కేటాయిస్తున్నట్టుగా చెప్పారు.గ్రామల అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ సిఎం కెసిఆర్ నాయకత్వంలో గ్రామాలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాయన్నారు. గత ప్రభుత్వాలు చేయనటువంటి పనులు బిఆర్‌ఎస్ చేస్తుందన్నారు.పటాన్‌చెరు నియోజకర్గం రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా మారబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, వైస్ ఎంపిపి స్వప్న శ్రీనివాస్, ఆత్మకమిటీ చైర్మణ్ కుమార్ గౌడ్, ఉప సర్పంచ్ లింగారెడ్డి, ఎంపిడిఓ బన్సిలాల్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News