Monday, December 23, 2024

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్షం

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు: గ్రామల అభివృద్ధే ప్రభుత్వ లక్షంగా తెలంగాణలో కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని చిట్కుల్ గ్రామంలో రూ. 9 లక్షల అంచనా వ్యయంతో అంతర్గత మరుగుదొడ్ల నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్‌తో కలసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగునంగా గ్రామల అభివృద్ది చేస్తున్నట్టుగా చెప్పారు.

ప్రణాలిక బద్ధంగా గ్రామల అభివృద్ధ్దికి నిధులు కేటాయిస్తున్నట్టుగా తెలిపారు. గ్రామల అభివృద్ధ్దికి స్థానిక పరిశ్రమల యాజమాన్యాలు ఎంతో సహకరిస్తున్నాయన్నారు.నియోజకవర్గ అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలు అందించడంలో ముందున్నట్టుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు దశర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఎంపిటిసిలు మంజుల, మాధవి, గ్రామ ఉప సర్పంచ్ విష్నువర్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News