Wednesday, January 22, 2025

గ్రామాల అభివృద్ధే బిఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: గ్రామాల అభివృద్ధే బిఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం కట్టంగూర్ మండలంలోని బొల్లేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో బొల్లేపల్లి గ్రామంలో ఎస్‌డిఎఫ్ నిధుల కింద 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్లు, డ్రైన్‌లు మరియు బొల్లేపల్లి గ్రామం నుండి పెరిందేవిగూడెం ఆవాస గ్రామానికి రూ. 5 లక్షల వ్యయంతో చేపట్టనున్న మట్టి రోడ్డు మరమ్మతులకు, పెరిందేవిగూడెం గ్రామంలో సిసిరోడ్డు నిర్మాణ పనులకు స్థా నిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

తొలుత గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం నుండి బస్టాండ్ వరకు స్థానిక బిఆర్‌ఎస్ శ్రేణులు నిర్వహించిన భారీ ర్యాలీలో ఎమ్మెల్యే చిరుమర్తి పాల్గొనగా వారికి మహిళలు కోలాట ప్రదర్శనలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే చిరుమర్తిని స్థానిక బిఆర్‌ఎస్ నాయకులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన తెల ంగాణ రాష్ట్రంలో అనేక సంక్షే మ పథకాలు అమలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచి అని ఎమ్మెల్యే చిరుమర్తి పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలి పారు. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకుల చేతుల్లో నిరాదరణకు, నిర్లక్షానికి గురైన అనేక గ్రామాలు సిఎం కెసిఆర్ పాలనలో గ్రామాలకు దశలవారిగా మహర్ధశ వచ్చిందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి జెల్లా ముత్తి లింగయ్య, జడ్పీటిసి తరాల బలరాములు, నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పోగుల నర్సింహ్మ, బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఊట్కూరి ఏడుకొండలు, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షులు గుర్రం సైదులు, ఎంపిటిసిల ఫోరం మండల అధక్షులు పాలడుగు హరికృష్ణ, మల్లారం, పిట్టంపల్లి, కలిమెర గ్రామాల సర్పంచ్‌లు దాసరి సంజయ్ కుమార్, పనస సైదులు, పిన్నపురెడ్డి నర్సిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News