Thursday, January 23, 2025

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందని తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్‌కుమార్ అన్నారు. శనివారం నాగారం మండల పరిధిలోని ఈటూరు గ్రామంలో సిఐఆర్‌ఎఫ్ నిధుల కింద నాలుగు కోట్ల వ్యయంతో నిర్మించే రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసి ఆయన మాట్లాడారు.

దేశానికి పల్లెలు అభివృద్ధి చెందుతేనే దేశ సంపద పెరుగుతుందని పేర్కొన్నారు. ఈటూరు గ్రామం నుండి శాంతినగర్ క్రాస్ రోడ్డు వరకు ఈ రోడ్డు విస్తరణ పనులు జరుగుతాయని సీఐఆర్‌ఎఫ్ నిధుల కింద నాలుగు కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు తెలిపారు. స్వరాష్ట్రంలో రహదారులను గుంతులుగా లేకుండా బీటి రోడ్లతో నిర్మించడం వలన నేడు తెలంగాణ రాష్ట్రం సుం దరీకరణగా తయారైందని సూచించారు.

ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి గుంతకండ్ల మణిమాల, ఆర్ అండ్ బి మంత్రి పర్సన్ సెక్రటరీ గడ్డం ముకుందారెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కళ్లెట్లపల్లి ఉప్పలయ్య, సంకేపల్లి రఘునందన్ రెడ్డి,రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ గుండగాని అంబయ్య గౌడ్, సర్పంచ్ పేరాల సరిత యాదగిరి, బిఆర్‌ఎస్ పార్టీ మండల నాయకులు చిల్లర చంద్రమౌళి, రమేష్ గౌ డ్, ఈరేటి అంజి, ఈదుల కిరణ్, గంట నరసింహారెడ్డి, గోడిశాల యాదగిరి, యుగేందర్, భవాని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News