Monday, January 20, 2025

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధేయం

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ రూరల్ : గ్రామాల అభివృద్ధే లక్షంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ మండల పరిధిలోని కుమ్మెర గ్రామంలోని 5 కాలనీలలో కొత్తగా సిసి రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యతతో పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే కృషితో మెగా కంపెనీ వారు అన్ని మౌ ళిక సదుపాయాలతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News