Monday, December 23, 2024

బిఆర్‌ఎస్‌తోనే గ్రామాల అభివృద్ధి

- Advertisement -
- Advertisement -
  • పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

దామెర: బిఆర్‌ఎస్‌తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా దామెర మండలం సింగరాజుపల్లి గ్రామంలో రూ. 3.04 లక్షలతో సింగరాజుపల్లి నుంచి హరిశ్చంద్ర నాయక్‌తండా వరకు నూతన రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందారన్నారు.

నియోజకవర్గం అన్ని గ్రామాల్లో రోడ్ల పనులు పూర్తయ్యాయన్నారు. గ్రామాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష నాయకులు పద్ధతి మార్చుకొని జరుగుతున్న అభివృద్ధికి సహకరించాలన్నారు. మోదీ అంటే నమ్మించి మోసం చేయడమేనని ప్రజలందరికీ తెలుసన్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గరిగె కల్పన కృష్ణమూర్తి, ఎంపిపి కాగితాల శంకర్, వైస్ ఎంపిపి జాకీర్ అలీ, సర్పంచులు ఉప్పుల రజిత సత్యం, పున్నం రజిత సంపత్, కుక్క శ్రావణ్య అనిల్, తహసీల్దారు జ్యోతి వరలక్ష్మి దేవి, బిఆర్‌ఎస్ మండలాధ్యక్ష కార్యదర్శులు గండు రామకృష్ణ, ముదిగొండ కృష్ణమూర్తి, ఎంపిటిసిలు సంగనబోయిన మౌనిక కిరణ్, పోలం కృపాకర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News