యాదాద్రి భువనగిరి: బిఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. భూదాన్‌పోచంపల్లి మండలంలో జూలూరు గ్రామంలో బుధవారం పర్యటించి వాడవాడలా తిరుగుతూ ప్రజలతో సమస్యల గురించితెల్సుకున్నారు. అలాగే గ్రామంలో పైళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంటును ప్రారంభించారు.
ఈసందర్బంగా అల్లీనగర్ గ్రామంలో యాధవసంఘం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశా రు. రజక సంఘం, కురుమ సంఘం భవనాల మరమ్మతు పనులకు ఆమోదం తెలిపారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వసంక్షేమ పథకాలను గ్రామాలలో ప్రజలదరికి చేర్చడంతో గు ర్తింపు లభిస్తుందని అన్నారు.
ఈకార్యక్రమంలో ఎంపిపి మాడ్గుల ప్రభాక ర్ రెడ్డి, వైస్ ఎంపిపి పాక వెంకటేష్, సర్పంచు యాకరి రేణుకనర్సింగ్‌రావ్, ఎంపిటిసి బొచ్చు శంకరమ్మ, ఫోరం అధ్యక్షులు బత్తుల మాధవిశ్రీశైలంగౌడ్, పిఎసిఎస్ చైర్మన్ కందాడి భూపాల్‌రెడ్డి, ఐతరాజు బిక్షపతి, మ ండలపార్టీ అధ్యక్షులు పాటి సుధాకర్ రెడ్డి, కార్యదర్శి చిలువేరు బాల్‌నర్సింహా, నాయకులు కొటమల్లారెడ్డి, ఎంపిడిఒ బాలశంకర్, అర్‌ఐ గుత్తా వెంకట్‌రెడ్డి, ఎఈలు వెంకటేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.