Wednesday, January 22, 2025

తెలంగాణలో అభివృద్ధి పరుగులు

- Advertisement -
- Advertisement -

వనపర్తి : తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ శాఖ, జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఈ కార్యక్రమం వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుంచి ఏకో పార్కు వరకు నిర్వహించారు. ఈ సందర్భ ంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి దినచర్యలో భాగంగా శారీరక వ్యాయామం చేయడం ద్వారా శారీరక రుగ్మతలు తొలగిపోయి ఆరోగ్యవంతమైన జీవితం సొంతమవుతుందన్నారు. యోగా,  ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందని, మంచి ఙ్ఞాపక శక్తి పెరుగుతుందన్నారు. జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద ఎత్తున మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

ఆహ్లాదకరమైన పార్కులను ఏర్పాటు చేయడం ద్వారా ఉద యం నడకకు వచ్చే వారికి ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సఖి సెంటర్ ఆధ్వర్యంలో ఎకో పార్కు వద్ద చిన్నారులతో మానవహారం ఏ ర్పాటు చేసి మంత్రి చేతుల మీదుగా పోస్టర్లను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ రన్‌లో జిల్లా పరిషత్ చైర్మెన్ ఆర్. లోకనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నం ద్ లాల్ పవర్, మున్సిపల్ చైర్మెన్ గట్టు యాదవ్, జిల్లా అదనపు ఎస్పి షాకీర్ హుస్సేన్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సుధీర్ రెడ్డి, సఖి నిర్వాహకురాలు చెన్నమ్మ తామస్, చంద్రశేఖర్, క్రీడాకారులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వనపర్తి పట్టణంలోని హిందీ బిఈడి కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జూనియర్ సివిల్ జడ్జి రవి కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సఖి కేంద్రం సభ్యులతో ప్రతిఙ్ఞ నిర్వహించి పని వద్దు, చదువు ముద్దు గోడ పత్రికలను ఆయన విడుదల చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల కార్మికులను పనులలో పెట్టుకోరాదని, వారు విద్య అభ్యసించే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన అన్నారు. సఖి కేంద్రం ద్వారా ఎంతో మందికి ఆదరణ క ల్పిస్తున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. సఖి నిర్వాహకురాలు చిన్నమ్మ తమస్, సిడబ్లూసి చైర్మెన్ అలివేలమ్మ, రాంబాబు, లక్ష్మి, సౌజన్య, శ్రీలక్ష్మి, సఖి కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News