Sunday, November 17, 2024

అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

- Advertisement -
- Advertisement -

దుగ్గొండి: నాలుగున్నర ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రపంచ మాద్యమాలుగా సోషల్ మీడియా ముందంజలో ఉందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం దుగ్గొండి మండల బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతీ ఇంట్లో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారు ఉన్నారు. నియోజకవర్గంలో 90 శాతం అభివృద్ధి ఒక్క బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలోనే జరిగింది.
మండలంలోని ప్రతీ గ్రామంలో జరిగిన అభివృద్ధిని, జరగాల్సిన అభివృద్ధి నివేదికలు తయారుచేసుకోవాలి. ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం అద్భుతంగా కృషి చేస్తున్న ప్రభుత్వ పని తీరును గ్రౌండ్‌లోకి తీసుకెళ్లాలి. పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరూ ఐకమత్యంతో కృషి చేయాలి. ప్రతిపక్షాలకు నర్సంపేటలో చోటు లేదు. స్థానికంగా ఉంటూ ప్రజా సమస్యలపై, అభివృద్ధిపై నా ఆలోచన, ధ్యాస. పంట నష్టం కింద ఎకరాకు రూ. 10 వేలు ఇచ్చిన ఏకైక సీఎం కేసీఆర్. త్వరలోనే నగదును రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు.
ఈ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ మనది. గతంతో పోల్చితే ప్రతీ గ్రామంలో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు అసలు పట్టింపే లేని పల్లెలు నేడు కేసీఆర్ పాలనలో పచ్చదనం, పారిశుద్ధంతో కలకలలాడుతున్నాయి. ప్రతిపక్షాల చౌకబారు విమర్శలకు అసత్య ప్రచారాలకు ఎక్కడా కుంగిపోకుండా మనం చేసిన ప్రగతిని చూపుతో వారికి సమాధానం చెబుదాం. రామప్పపాకాల ప్రాజెక్టు, రామప్పరంగయ్యచెరువు ప్రాజెక్టు, కావాల్సినన్ని గురుకుల పాఠశాలల మంజూరు, పోడు భూములకు పట్టాలు, నర్సంపేటకు 650 బెడ్ల ఆసుపత్రి, మెడికల్ కళాశాల మంజూరు లాంటివి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేవి. ఏ గ్రామానికి వెళ్లినా 80 నుంచి 90 శాతం ఓటర్లు మనవాళ్లే. మీ ఐక్యత ఆశీస్సులు ఉన్నంత కాలం మన పార్టీకి తిరుగులేదు.
నిత్యం ప్రజలకు కావాల్సిన బాగోగులు చూడటం తప్పా సవాళ్లు, ఛాలెంజ్‌లు విసిరే సంస్కృతి మనది కాదు. మరోసారి నర్సంపేట గడ్డ మీద గులాబి జెండా ఎగుర వేయుటలో కీలక పాత్ర పోషిస్తున్న పార్టీ శ్రేణులందరికీ ధన్యవాదాలు. ఇదే రెట్టింపు ఉత్సాహంతో పార్టీ బలోపేతం కొరకు అందరూ సమన్వయంతో కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ సమాశంలో జడ్పీ వైస్ ఛైర్మన్ ఆకుల శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు సుకినె రాజేశ్వర్, వంగేటి అశోక్, ఎంపీటీసీలు, సర్పంచులు, క్లస్టర్ బాధ్యులు, పీఏసీఎస్ ఛైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News