Monday, December 23, 2024

కులమతాలకతీతంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు

- Advertisement -
- Advertisement -

రామారెడ్డి:రాష్ట్రంలో సిఎంకెసిఆర్ కులమతాలకతీతంగా అభివృద్ధ్ది,సంక్షేమ పథకాలు చేపడుతున్నారని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మండలంలోని అన్నా రం,మద్దికుంట గ్రామాలకు చెందిన వివిధ కుల సంఘాల నిర్మాణాలకు సంబంధించిన రూ.31లక్షల ప్రోసిడింగ్ కాపీలను కామారెడ్డి క్యాంప్ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే అందజేశారు.అనంతరం ఆయా గ్రామాల కులసంఘాల ప్రతినిధులు విప్ గోవర్ధన్‌ను శాలువాలతో ఘనంగా సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నారెడ్డి దశరత్‌రెడ్డి,మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బొమ్మిడి రాంరెడ్డి,అమృత బాలరాజు,బీఆర్‌ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సలావత్ బుచ్చిరెడ్డి,ఉప సర్పంచ్‌లు శ్రీనివాస్‌రెడ్డి,నరేందర్,యూత్ మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి,బీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షులు కుక్కల రాజయ్య,గజ్జెల శంకర్,నాయకులు లక్ష్మయ్య,తోట గం గయ ్య,లక్ష్మన్,శంకర్,మోషే,పోచయ్య,స్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News