Sunday, November 24, 2024

అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -

మిడ్జిల్ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఎంపిపి సుదర్శన్, జడ్పీటీసీ శశిరేఖ బాలు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రా మ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సిఎం కెసిఆర్ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడన్నారు.

ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కొరకు శ్రమిస్తున్న సపాయి కార్మికు లను శాలువాలతో వారు సత్కరించారు. అనంతరం మున్ననూరు గ్రామంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథ కంలో భాగంగా రైతుల కోసం నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండటం వలన రైతు లు పడే ఇబ్బందుల గురించి నియోజకవర్గ ఎమ్మెల్యే డా. సి. లకా్ష్మరెడ్డి దృష్టికి తీసుకురావడంతో వారి ఆదేశానుసారం కెఎల్‌ఐఎస్‌ఈ సత్యనారాయణరెడ్డి, ఈఈ శ్రీకాంత్, డిఈ దేవరాజు, కెనాల్ వంతెనలను పరిశీలించి త్వరలోనే వంతెన నిర్మాణ పనులను పూర్తి చేస్తామని తెలిపారు.

అనంతరం ఎంపిపి సుదర్శన్ వాడ్యాల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొని వారికి నోటు పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు రాధిక వెంకట్‌రెడ్డి, మంగమ్మ శ్రీనివా సులు, ఎంపీటీసీ గౌస్, రాష్ట్ర నాయకులు ఎల్లయ్య యాదవ్, ఉప సర్పంచ్ పద్మ మల్లయ్య, మోహన్ రెడ్డి, శ్రీశైలం, వెంకటయ్య, సుకుమార్, నర్సింహ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News