Monday, December 23, 2024

బిఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

ముదిగొండః :బిఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ అన్నారు. మండల పరిధిలోని వల్లాపురం గ్రామంలో రూ. 10 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో మంజూరైన సిసి రోడ్లకు ఆయన మంగ ళవారం శుంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనను గెలిపించిన ప్రజలను గాలికొదిలేని ఎక్కడో రోడ్ల వెంట తిరగే భట్టి కావాలో నిత్యం ప్రజల్లో ఉండే మేము కావాలో వచ్చే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయించాలన్నారు. వారి ప్రభుత్వ హాయాంలో చీఫ్ విప్, అసెంబ్లీ డిప్యూటి స్పీకర్‌గా పనిచేసిన ఆయన ఈ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. తన ప్రజలకు ఏమీ చేయలేని వాడు ఎక్కడెక్కడో రోడ్లు పట్టుకుని తిరగుతూ హామీలు ఇస్తున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. గత అయిదేల్ల కాలంలో మేము నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి ఏ ఇబ్బంది వచ్చినా తక్షణమే స్పందించి ఆదుకున్నామన్నారు. ఎంతో మంది పేదలకు సీఎం సహాయ నిధి ఇచ్చి ఆదుకున్నామన్నారు.

కానీ భట్టీ మాత్రం ప్రభుత్వం ఇచ్చే కళ్యాణ లక్ష్మీ చెక్కు ఇవ్వటానికి కూడా రావటం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఎంతో మందు చూపు ఉన్న నాయకుడనీ దేశం గర్వించే ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. ఆ పథకాలు కొనసాగాలన్నా సంక్షేమం, అభివృద్ధి పరుగుల పెట్టాలన్నా మరలా కేసీఆర్‌ను సీఎం చేయాలన్నారు. ఎంతో విజ్ఞులైన మధిర నియోజకవర్గ ప్రజలు ఈ సారి సరైన నిర్ణయం తీసుకుటారని అన్నారు. ఆ తరువాత బిఆర్‌ఎస్ లో చేరిన టిడిపి వార్డు సభ్యుడికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తరువాత పలు శుభ కార్యాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సామినేని హరిప్రసాద్, సర్పంచ్ అమడాల జక్కర్, బిఆర్‌ఎస్ నాయకులు బత్తుల వీరారెడ్డి, తుపాకుల యలగొండ స్వామి, తోట ధర్మారావు, మీగడ శ్రీనివాస్ యాదవ్, గుంటూరు పద్మనాభం, కోడె బాబు, పంది శ్రీను, బిక్షం, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News