Monday, December 23, 2024

అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : సిసి రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతగా, త్వరితగతిన పూర్తి చేయాలని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలోని 2వ వార్డులో కోటి 20 లక్షల రూపాయలతో 5 చోట్ల నూతన సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2వ వార్డులో సుమారు కోటి 20 లక్షల రూపాయలతో 1400మీటర్ల పొడవు సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం జరిగిందన్నారు.

వర్షాభావ పరిస్థితుల వల్ల వారం పది రోజుల్లో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. పట్టణంలో పెద్ద ఎత్తున అన్ని వార్డులలో సిసి రోడ్డు నిర్మిస్తున్నామని తెలిపారు. రోడ్డు వెడల్పు ఎక్కడైనా తగ్గితే ఆ ప్రదేశంలో ఉన్న ఇంటి వాళ్లతో మాట్లాడి ఒప్పించి వెడల్పు తగ్గకుండా వేయాలని సూచించారు. అనంతరం జిల్లా కేంద్రంలో 2 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న గ్రంథాలయ భవనాన్ని పరిశీలించారు. పనుల పురోగతి గురించి కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.

పనులు త్వరగా పూర్తి చేయాలని, కాంట్రాక్టర్, అధికారులకు సూచించారు. అభివృద్ధి పనులను త్వరతిగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో 7 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ మార్కెట్, 4 కోట్లతో నిర్మిస్తున్న నాన్ వెజ్ మార్కెట్ పనులను ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News