మేడ్చల్ ్ల: ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధ్ది పనులను సకాలంలో పూర్తిచేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అమోయ్ కుమార్‌తో కలిసి అధికారులతో మేడ్చల్ నియోజకవర్గంలో అభివృద్ధ్ది పనులు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఘట్‌కేసర్‌లోని ఆర్‌వోబిని పనులు వేగవంతం చేసి త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పంపిణీ చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కలెక్టర్ అమోయ్ కుమార్‌కు సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇళ్ల స్థ లాలు, నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. నియోజకవర్గంలో రెండో విడత దళిత బంధుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో అన్ని అభివృద్ది పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఇందుకు నిధుల కొరత లేదని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు
. జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ మే డ్చల్ నియోజకవర్గంలో అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాలను విజయతంగా అమలు చేస్తున్నామని అన్నారు. అర్హులైన వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల జాబితాను తయారు చేసినట్లు తెలిపారు. ఘట్‌కేసర్ అర్‌వోబి పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నరసింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, కీసర ఆర్‌డీవో రవి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.