Tuesday, January 21, 2025

యావత్తు ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా మానేరు రివర్ ఫ్రంట్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : యావత్తు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించేలా అత్యాధునిక హంగులతో భావితరానికి వందేళ్లు సరిపడేలా మానేరు రివర్ ఫ్రంట్ నిలువనుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం మానకొండూర్ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, నగర మేయర్, ఇతర ప్రజాప్రతి నిధులతో కలిసి వంతెనపై 6.5 కోట్లతో ఏర్పాటు చేయనున్న డైనమిక్ లైటింగ్ సిస్టం పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే వందేళ్ల భావితరానికి సరిపడే అభివృద్ధితో నిర్మిస్తున్న కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ పనులతో కరీంనగర్ జిల్లా యావత్తు ప్రపంచ దృష్టిని ఆకర్షించనుందని పేర్కొన్నారు. మానేరు వంతెన నిర్మాణ పనులు ఒకవైపు పూర్తి చేసుకోవడం జరిగిందని, మరోవైపు కూడా త్వరలోనే పూర్తి చేసుకొని రోడ్డు పనులు ప్రారంభం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు.

మానేరు వంతెనను మరింత అందంగా తీర్చిదిద్దే క్రమంలో వంతెనపై 6.5 కోట్లతో డైనమిక్ లైటింగ్ సిస్టం పనులను ప్రారంభించుకోవడం జరుగుతుందని, వీటితో పాటుగా అల్గునూరు బ్రిడ్జిపై నిలబడి చూసిన స్పష్టంగా కనిపించేలా జర్మన్ టెక్నాలజితో 45 వేల పిక్సల్ గల 10 ఇన్‌టూ 30 సైజులో 65 కనిపించేలా మానేరు వంతెనకు ఇరువైపుల రెండు చొప్పున 4 టీవీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీటి ద్వారా అడ్వర్టెజ్‌మెంట్ మొదలగు చిత్రాలను ప్రదర్శించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే పలు పారిశ్రామిక రంగాల దృష్టిని సైతం ఆకర్షించడంతో హోటల్ మొదలగు వాటి ఏర్పాటు పలువురు ముందుకు వస్తున్నారని తెలిపారు. వీటి పనుల పూర్తిని బట్టి జూన్ 2న గాని లేదా ఆగస్టు 15న ప్రారంభించుకోవడానికి ప్రణాళికలను సిద్దం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. మానేరు వంతెన ఒకవైపు ఇప్పటికే పూర్తి అయిందని, మరో వైపు కూడా పూర్తి చేసుకొని వాహనాల రాకపోకలను ఉగాది నుండి ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.

ఇది వరకుఏ అనుకున్నట్లుగా అప్పర్, లోయర్ ప్రామినెడ్ పనులను కూడా పూర్తి చేసుకొని ప్రపంచంలో 3వ అతి పెద్ద ఫౌంటెన్‌ను పనులను 60 కోట్లు మంజూరై టెండర్లు పూర్తయినవని, 3, 4 రోజులలో పనులు ప్రారంభించుకోవడం జరుగుతుందని ఈ వాటర్ ఫౌంటెన్‌లు యావత్తు ప్రపంచంలోనే మూడు దేశాలలో మాత్రమే ఉన్నాయని, చైనా, సౌత్‌కొరియాలోని సియోల్ తరువాత మన కరీంనగర్‌లోనే ఈ వాటర్ ఫౌంటెన్ ఉండనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, వైయర్ వై సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, ఆర్డీవో ఆనంద్‌కుమార్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, ఆర్‌అండ్‌బి ఈఈ సాంబశివరావు, డీఈ రవీందర్, ఎఈ రాజశేఖర్, అశోక్, కాంట్రాక్టర్ కమాలుద్దీన్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News