ముంబై:మహారాష్ట్రలో‘మహాయుతి’ ప్రభుత్వం కొలువుతీరింది. బిజెపి నేత ఫడనవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. శివసేన నేత ఏక్ నాథ్ షిండే, ఎన్ సిపి నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఆజాద్ మైదాన్ లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సిపి. రాధాకృష్ణన్ వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జెపి నడ్డా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, ఏపి సిఎం చంద్రబాబు నాయుడు, ఎంపి సిఎం మోహన్ యాదవ్, యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ సిఎం భజన్ లాల్ శర్మ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి 19 మంది ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
.@Dev_Fadnavis takes oath as Maharashtra CM #MaharashtraCM #DevendraFadnavis pic.twitter.com/Q9WvLZKf5g
— IndiaToday (@IndiaToday) December 5, 2024