Thursday, January 23, 2025

ముంబై మాది.. మీ అబ్బ సొత్తు కాదు

- Advertisement -
- Advertisement -

ముంబై: ముంబైను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలంటూ కర్నాటక న్యాయ శాఖ మత్రి మధు స్వామి చేసిన డిమాండుపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మండిపడ్డారు. ముంబై మహారాష్ట్ర సొత్తని, తమ రాజధానిపై ఇతరులు కన్నేస్తే సహించబోమని బుధవారం అసెంబ్లీలో ఫడ్నవీస్ స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దుల వివాదం నేపథ్యంలో కర్నాటక నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు.

ముంబై నగరం మహారాష్ట్రకు చెందినదని, ఎవడడబ్బ సొత్తు కాదని ఆయన వ్యాఖ్యానించారు. తమ మనోభావాలను కర్నాటక ప్రభుత్వంతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృషికి తీసుకెళతామని ఆయన చెప్పారు. ముంబై కర్నాటకకుచెందినదని కర్నాటకకు ఎందిన బిజెపి ఎమ్మెల్యే లక్ష్మణ్ సావడి వాదించడం పుండు మీద కారం చల్లినట్లు ఉందని మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన అజిత్ పవార్(ఎన్‌సిపి) వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News