Thursday, January 9, 2025

దేవీసింగ్ షెకావత్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

ముంబై : భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ భర్త దేవీసింగ్ రాణ్‌సింగ్ షెకావత్ (89)శుక్రవారం మృతి చెందారు. కాంగ్రెస్ నేతగా, మాజీ ఎమ్మెల్యేగా సుపరిచితులు అయిన దేవీసింగ్ షెకావత్ పుణేలో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కెమ్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస వీడారు. విద్యావేత్త కూడా అయిన డాక్టర్ దేవీసింగ్‌కు భార్య ప్రతిభాపాటిల్, కూతురు జ్యోతి రాథోడ్ ఉన్నారు. షెకావత్‌ను ఈ నెల 12వ తేదీన ఇంట్లో పడిపోగా ఆసుపత్రిలో చేర్పించగా సర్జరీ జరిగింది.

ఆ తరువాత ఆయనకు పలు ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తాయి. హై బిపి, కిడ్నీలు పనిచేయకపోవడం వంటి ఇబ్బందులతో కోలుకోలేకపోయినట్లు తెలిసింది. ఆయన ఆకస్మిక మరణం పట్ల సీనియర్ కాంగ్రెస్ నేతలు పలువురు సంతాపం తెలిపారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉన్నారు, వ్యవసాయవేత్తగా కూడా పేరొందారు. అమరావతికి తొలి మేయర్‌గా, ఎమ్మెల్యేగా కూడా వ్యవహరించారు. దేశ రాష్ట్రపతిగా వ్యవహరించిన ప్రతిభాతాయికి ఆదర్శ భర్తగా తోడుగా నిలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News