Thursday, December 5, 2024

చిరంజీవి డ్యాన్స్‌లతో పాటలని మరో స్థాయికి తీసుకెళ్లారు..

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ’వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన ‘వాల్తేరు వీరయ్య’ అల్బమ్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. అల్బమ్‌లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్, పూనకాలు లోడింగ్, నీకేమో అందం ఎక్కువ పాటలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి.

‘వాల్తేరు వీరయ్య’ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతున్న నేపధ్యంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “పూనకాలు లోడింగ్ పాటకు బూరలాంటి వాయిద్యంతో ట్యూన్‌ని కంపోజ్ చేయడం జరిగింది. చిరంజీవికి చాలా నచ్చింది. ‘ఆదరగొట్టావ్ అబ్బాయ్’ అన్నారు. నేను కంపోజ్ చేసిన ట్యూన్ ఒక ఎత్తు అయితే మెగాస్టార్ డ్యాన్స్‌లతో పాటని మరో స్థాయికి తీసుకెళ్ళిపోయారు. బాస్ పార్టీ యూత్‌కి కనెక్ట్ అయ్యేలా చేశాం. బాస్‌ని చాలా రోజుల తర్వాత పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌లో చూస్తున్నాం. ఎక్కడా తగ్గకూడదని ప్రతి పాట విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం.

‘వాల్తేరు వీరయ్య’లో అన్ని పాటలు హిట్ కావడానికి కారణం దర్శకుడు బాబీ చెప్పిన సబ్జెక్ట్. అన్నిటికి మించి బాస్ మెగాస్టార్ మా ఇద్దరిపై పెట్టుకున్న నమ్మకం. ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే బాబీ డ్రీమ్ నెరవేరడం చాలా ఆనందంగా వుంది. ఇందులో రవితేజది చాలా కీలకమైన పాత్ర. సినిమా చూసి చిరంజీవితో ఒకే ఒక మాట చెప్పా. ‘’నవ్విస్తూ ఏడిపించారు.. ఏడిపిస్తూ నవ్వించారు” అని చెప్పా. ఆయన కాసేపు మౌనంగా వుండి… ‘ఎంత బాగా చెప్పావు మై బాయ్‌”అన్నారు.

ఇందులో నువ్వు శ్రీదేవి పాటలో ఆయన స్క్రీన్‌పై ఎలా చేస్తారో ముందే ఊహించేసి కంపోజ్ చేసి బాబీకి చూపించా. అలాగే పూనకాలు లోడింగ్ పాట కూడా అంతే. రవితేజ, చిరంజీవి కనిపిస్తే ఎంత సందడిగా ఉంటుందో ఆ ఎనర్జీ అంతా పాటలో ఇచ్చేశాం. శేఖర్ మాస్టర్‌కి కూడా థాంక్స్ చెప్పాలి. ఈ మధ్య కాలంలో శేఖర్ కంపోజ్ చేసిన సిగ్నేచర్ స్టెప్స్ ఎక్కువగా హిట్స్ కావడం చాలా ఆనందంగా వుంది”అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News