Friday, December 20, 2024

మ్యూజికల్ కన్సర్ట్కు రండి: సీఎం రేవంత్ కు డిఎస్పి ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మ్యూజికల్ సెన్సేషన్ దేవిశ్రీప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 19న దేవిశ్రీప్రసాద్ కన్సర్ట్‌ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యూజికల్ షోకు రావాలని ఆహ్వానించేందుకు జూబ్లీహిల్స్ లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిఎస్ పి కలిశారు.

నిర్మాత బండ్ల గణేశ్‌తో కలిసి సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్‌కు దేవిశ్రీప్రసాద్ గిటార్‌ను బహుమతిగా అందించారు. కాగా, హైదరాబాద్ లో ఈ మ్యూజికల్ కన్సర్ట్ ను ప్రారంభించి తర్వాత దేశంలోని పలుచోట్ల నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News