Monday, December 23, 2024

డెవిల్ నుంచి మాళవిక నాయర్ ఫస్ట్ లుక్‌ రిలీజ్‌..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌ తర్వాత కల్యాణ్ రామ్ నుంచి ఆ మధ్య వచ్చిన ‘అమిగోస్’ ఆశించిన స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. ఆ తరువాత ఆయన చేసిన ‘డెవిల్’ త్వరలో ప్రేక్షకులను పలకరించ నుంది. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఉప‌శీర్షిక‌. ఈ చిత్రానికి నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్.. నెట్టింట వైరల్ హల్ చల్ చేస్తోంది. ఈ రోజున కల్యాణ్ రామ్ బర్త్ డే కావడంతో,తాజాగా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ మాళవిక నాయర్  ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ మూవీలో మాళవిక నాయర్ మణిమేఖల అనే రాజకీయ నాయకురాలి పాత్రలో నటిస్తోంది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News