Wednesday, January 22, 2025

‘డెవిల్’లో కళ్యాణ్‌రామ్ విశ్వరూపాన్ని చూస్తారు

- Advertisement -
- Advertisement -

నందమూరి కళ్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా రూపొందించిన ఈ సినిమాను ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర దర్శక నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ “డెవిల్ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుంది.

ఇలాంటి కొత్త కాన్సెప్ట్ సినిమా చేయాలంటే, కథను నమ్మి హీరో ముందుకు రావాలంటే గొప్ప విషయం. రెండేళ్ల పాటు కళ్యాణ్‌రామ్ మరో సినిమా ఏదీ చేయకుండా వర్క్ చేశారు. ట్రైలర్‌లో కళ్యాణ్ రామ్‌ని చూసింది తక్కువ. రేపు థియేటర్స్‌లో ఆయన విశ్వరూపాన్ని చూస్తారు. యాక్షన్, నటన అదిరిపోతుంది”అని అన్నారు. హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ “మంచి కథ, విజువల్స్, మ్యూజిక్ ఉండి.. దానికి తగ్గట్టు టీమ్ వర్క్ చేసినప్పుడు ఆడియన్స్ థియేటర్స్‌కి వద్దన్నా వస్తారని బింబిసార సినిమా సమయంలో చెప్పాను.

దాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. అదే కోవలో డెవిల్ సినిమా మంచి కథ, కథనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమాను గొప్పగా రూపొందించిన అభిషేక్ నామాకి థాంక్స్. ప్రేక్షకులకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు కొత్త కథతో డెవిల్ సినిమా ఉంటుంది. ఇక బింబిసార 2 సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నుంచి మొదలు పెడతాం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంయుక్తా మీనన్, మాళవికా మోహనన్, శ్రీకాంత్ విస్సా, సౌందర్ రాజన్, హర్షవర్ధన్ రామేశ్వర్, తమ్మిరాజు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News