Sunday, December 22, 2024

పత్రాల దహనంపై సిఐడి చీఫ్ రఘురామ్‌రెడ్డి, డిజిపి సమాధానం చెప్పాలి: దేవినేని ఉమ

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి నేత లోకేష్‌ను విచారణ సమయంలో ప్రశ్నించిన పత్రాలపై అనాడే అడిగామని టిడిపి దేవినేని ఉమ మహేశ్వర్ రావు చెప్పారు. ఆ పత్రాలు ఎలా వచ్చాయో ఇంతవరకు సమాధానం చెప్పలేదని, సిఐడి చీఫ్ రఘురామ్‌రెడ్డి తప్పుడు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, పత్రాల దహనంపై సిఐడి చీఫ్ రఘురామ్‌రెడ్డి, డిజిపి సమాధానం చెప్పాలని నిలదీశారు. పత్రాల దహనంపై సిఇఒకు కూడా ఫిర్యాదు చేస్తామని దేవినేని ఘాటుగా హెచ్చరించారు.  తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్‌లో పలు కాగితాలను సిబ్బంది దహనం చేశారు. సిట్ కార్యాలయ సిబ్బంది పలు పత్రాలు దహనం చేయడంపై అనుమానాలు ఉన్నాయని టిడిపి వాళ్లు ఆరోపణలు చేశారు. హెరిటేజ్ సంస్థకు చెందిన కాగితాలే తగలబెట్టి ఉంటారని టిడిపి వాళ్లు అనుమానం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News