Sunday, December 22, 2024

హుండీలో జారిపడ్డ ఐఫోన్

- Advertisement -
- Advertisement -

ఆలయాల్లో హుండీలో భక్తులు కానుకలు సమర్పిస్తుంటారు. అవన్నీ దేవుడికే చెందుతాయి. ఇది సంప్రదాయంగా కొనసాగుతోంది. అయితే తమిళనాడు లోని ఓ ఆలయంలో దేవుడి దర్శనానికి వెళ్లిన వ్యక్తి హుండీలో డబ్బులు వేస్తుండగా, అతడి ఐ ఫోన్ జారి అందులో పడింది. ఆ ఫోన్ ఇప్పించాల్సిందిగా ఆలయ యాజమాన్యాన్ని అభ్యర్థించాడు. కానీ ఫలితం దక్కలేదు. హుండీలో పడిన ఏ వస్తువైనా దేవుడి ఖాతా లోకే వెళ్తుందని,దానిని తిరిగి ఇవ్వలేమని అధికారులు తేల్చి చెప్పారు. తమిళనాడు లోని వినయగపురానికి చెందిన దినేష్ అనే వ్యక్తి తిరుపోరూరు లోని కందస్వామి ఆలయానికి వెళ్లాడు. దేవుడి హుండీలో డబ్బులు వేస్తుండగా, అతడి జేబులో ఉన్న ఐఫోన్ అనుకోకుండా హుండీలో పడిపోయింది.

గుడియాజమాన్యానికి ఈ విషయాన్ని తెలియజేశాడు. తన ఫోన్ ఇప్పించాలని అభ్యర్థించాడు. అయితే ఆ ఫోన్ హుండీలో పడింది కాబట్టి ఇప్పుడు అది ఆలయ ఆస్తి కిందకి వస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్‌ను తిరిగి ఇచ్చేది లేదని , డేటా మాత్రం తీసుకోవచ్చని స్పష్టం చేశారు. దీంతో అతడేమీ చేయలేక తిరిగి వెళ్లి .. హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ ( హెచ్ ఆర్ అండ్ సీఈ) అధికారులకు , స్థానిక మంత్రి శేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. వారు కూడా అదే చెప్పారు. హుండీలో జమచేసిన వస్తువు దేవుడి ఖాతా లోకే వెళ్తుందని, తిరిగి ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించవని మంత్రి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News