మహాకుంభ సంప్రోక్షణ
మొదటిరోజున పాల్గొననున్న
సిఎం కెసిఆర్
మధ్యాహ్నం నుంచి దర్శనానికి భక్తులకు అనుమతి
యథావిధిగా నిత్య పూజలు జరగనున్నాయి : ఇవొ గీతారెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: తెలం గాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యా దాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పునర్దర్శనం భక్త జనానికి దొరకనుంది. ఈ మేరకు ఆలయ కమిటీ అధికారులు ఈ నెల 28 నుంచి ముహుర్తం ఖరా రు చేసి, అందుకు సంబంధించి సఖల ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆ రోజున ఉ దయం 11:55 నిమిషాలకు మహా కుంభ సంప్రోక్షణ పూజతో శాస్త్రోక్తంగా ఆలయం పునర్దర్శనం కానుందని, సంప్రోక్షణానంతరం మూల దర్శనానికి అనుమతిస్తామని ఆ లయ ఈవో గీతారెడ్డి చెప్పారు. మొదటి రోజైన సోమవారం నాడు మహాకుంభ సంప్రోక్షణలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొననున్నారని తెలిపారు. సంప్రోక్షణ అనంతరం యథావిధిగా పూజాకార్యక్రమాలుంటాయని పేర్కొన్నారు.
ఈ నెల 21 నుంచి వారం రోజుల పాటు బాలాలయంలో పంచ కుండాత్మక యాగం నిర్వహించనున్నారనీ, 108 మంది పారాయణదారులూ, ఆలయ అర్చకులూ, వారి శిష్య బృందంతో ఈ మహా క్రతువు నిర్వహిస్తారని తెలియజేశారు. అంతే కాకుండా ఆలయంలోని స్వామివారి ఉత్సవమూర్తులను శోభాయాత్రగా ప్రధాన ఆలయానికి తరలిస్తామని చెప్పారు. కాగా తెల్లారుఝాము నుంచి మొదలయ్యే పూజాసమయాలలో భక్తులను స్వామి దర్శనానికి అనుమతించడం లేదనీ, అందుకు బదులుగా అదే రోజు మధ్యాహ్నం నుండి భక్తుల రాకకు అనుమతులిస్తామని ఈవో స్పష్టం చేశారు. ఇప్పటికైతే యాదాద్రి ఆలయ గోపుర కలశాలకు సంప్రోక్షణా పూజాఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు. లక్ష్మీనరసింహుని దర్శనానికి విచ్చేసే భక్తులకు జియో ట్యాగింగ్ ని కూడా ఉపయోగిస్తామని ఈవో గీతారెడ్డి తెలియజేశారు.