Monday, December 23, 2024

అమావాస్యతో కేతకీలో భక్తుల సందడి

- Advertisement -
- Advertisement -

ఝరాసంగం: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం అమావాస్య కావడంతో ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం సుప్రభాత సేవ, అభిషేకం, క్షీరాభిషేకం, పాలాభిషేకం, మహా మంగళ హారతి నిర్వహించారు. అనంతరం అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించిన భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. స్వామివారికి దర్శించుకోవడానికి మూడు నుండి నాలుగు గంటల సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. ఎండ విపరీతంగా ఉండడంతో క్యూలైన్‌లో చిన్నపిల్లలతో నిలిచి ఉండడంతో నాలుగు గంటల సమయం పట్టడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు భక్తులు పేర్కొన్నారు. అమావాస్య ఉన్నప్పటికీ భక్తులు రద్దీగా ఉన్న సమయంలో ఆలయ కార్యనిర్వణాధికారి లేకపోవడంతో ఆలయ అభివృద్ధి ఎలా జరుగుతుందని భక్తులు భక్తులు ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News