- Advertisement -
తాడ్వాయి : సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతర నేపథ్యంలో ములుగు జిల్లాలోని మేడారానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. గద్దెలపై సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని పసుపు, కుంకుమ, పువ్వులు, నైవేద్యం, చీరెలు సమర్పించి.. కొబ్బరికాయ కొట్టి మొక్కు చెల్లించుకుంటున్నారు. ఈ నెల 24 నుంచి 27 వరకు జరగబోయే మేడారం చిన్న జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జాతరలో మొదటి రోజైన 24న సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ఆలయాన్ని శుద్ధి చేయడంతోపాటు గ్రామ ద్వార స్తంబాలను స్థాపించనున్నారు. 25న అమ్మవార్లకు పసుపు, కుంకుమతో అర్చన చేయనున్నారు. 26న భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. సమ్మక్క -సారలమ్మలకు ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం 27 వ తేదీన జాతర ముగియనుంది.
- Advertisement -