Saturday, January 11, 2025

ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ దేవాలయానికి భక్తుల తాకిడి

- Advertisement -
- Advertisement -

సూర్యపేట:కోదాడ మండల పరిధిలోని ఎర్రవరం గ్రామంలో వేంచేసి ఉన్న బాల ఉగ్ర నరసింహస్వామి దేవాలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.కోదాడ నుంచి ఆర్టీసి వారు బస్సు సౌకర్యం కల్పించడం, సొంత వాహనాలలో సుమారు 60వేల మంది భక్తులు వచ్చారని ఆలయ కమిటి తెలిపారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చే శామని దేవాలయ కమిటి తెలిపారు. మధ్యాహ్నం భ క్తులకు అన్నదాన సౌకర్యం కల్పించారు. భక్తులు స్వా మివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్ర భుత్వం చొరవ తీసుకుని దేవాలయాన్ని అభివృద్ధి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News