Thursday, April 24, 2025

బాసర ఆలయంలో భక్తుల సందడి

- Advertisement -
- Advertisement -

బాసర : శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. నేడు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

భారీగా భక్తుల రావడంతో ఆలయంలో క్యూలైన్లు రద్దీగా కనిపించాయి. అమ్మవారి దర్శనానికి రెండుగంటల సమయం పట్టింది. భక్తులు తమ చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు జరిపించారు. వేకువ జామున నుండే ఆలయ అర్చకులు వేద మంత్రోశ్చరణాలతో శ్రీ మహాలక్ష్మీ మహంకాలి సరస్వతి అమ్మవార్లకు అభిషేకం, అర్చన అలంకరణ హరతి పూజలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News