Tuesday, December 24, 2024

శబరిమల అయ్యప్ప దేవాలయానికి పోటెత్తిన భక్తులు

- Advertisement -
- Advertisement -

మొదటిరోజే భారీగా రాక
కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన కేరళ పోలీసులు

మనతెలంగాణ/హైదరాబాద్:  కేరళలో ప్రసిద్ధి చెందిన శబరిమల అయ్యప్ప దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఇరుముడితో శబరిమల ఎక్కి అయ్యప్ప భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి అయ్యప్ప సన్నిధానం, పంబ వద్దకు భారీగా చేరుకున్నారు. మండల పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం గురువారం సాయంత్రం తెరుచుకుంది.

ఈనెల 17వ తేదీన స్వామివారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. దీంతోపాటు మండల మకరవిళక్కు వేడుకలు కూడా మొదలయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేరళ పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధునాతన సాంకేతికతతో భక్తుల రాకపోకలపై నిఘా ఉంచారు. అన్ని చోట్ల సిసిటివి కెమెరాలను అమర్చారు. 13 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు తాత్కాలిక పోలీస్ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వంటి దళాలను సైతం అందుబాటులో ఉంచారు. మరోవైపు, శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే దర్శించారు. 2024లో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావాలని తాను ప్రార్థించినట్లు శోభ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News