Saturday, December 21, 2024

శబరిమల అయ్యప్ప దేవాలయానికి పోటెత్తిన భక్తులు

- Advertisement -
- Advertisement -

కేరళలో ప్రసిద్ధి చెందిన శబరిమల అయ్యప్ప దేవాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇరుముడితో శబరిమలలో అయ్యప్ప భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. డిసెంబర్ 19 (గురువారం) ఒక్కరోజే 96,000పైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సీజన్‌లో అత్యధికంగా గురువారం ఒక్కరోజులోనే 96,007 మంది భక్తులు శబరిమలకు వచ్చినట్లు ఆలయ అధికారులు ఓ ప్రకటలో తెలిపారు. వారిలో 70,000 మంది వర్చువల్ బుకింగ్స్, స్పాట్ బుకింగ్స్ ద్వారా 22,121 మంది, పులిమేడ్ మీదుగా 3,016 మంది, ఎరుమేలి అటవీ మార్గం నుంచి 504 మంది భక్తులు వచ్చినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం కూడా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగందని, సాయంత్రం 5 గంటల వరకు 74,960 మంది భక్తులు వచ్చినట్లు తెలిపారు.

నవంబర్ 15 నుంచి డిసెంబర్ 19 వరకు మొత్తం 4,46130 మంది భక్తులు స్పాట్ బుకింగ్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. మండల పూజ నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. నవంబరు 16వ తేదీన ప్రారంభమైన మండల పూజ సీజన్, డిసెంబర్ 26వ తేదీన సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజతో ముగియనుంది. ఈ క్రమంలో తొలుత అయ్యప్ప స్వామిని ‘తంకా అంకి’తో అలంకరించిన తర్వాత, పవిత్రమైన బంగారు వస్త్రాన్ని ఉత్సవ ఊరేగింపుతో ఆలయానికి తీసుకొస్తారు. తర్వాత మండల పూజ నిర్వహిస్తారు. ఈ మండల పూజ సందర్భంగా డిసెంబర్ 22వ తేదీ నుంచి అయ్యప్ప దర్శనానికి దాదాపు లక్ష మందికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News