Friday, November 15, 2024

నవగిరికి పోటెత్తిన భక్తజనం

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/యాదాద్రి: అదిగో యాదాద్రి… శ్రీలక్ష్మీనారసింహుడి దర్శనమంటూ తెలంగాణలో ప్రసిద్ధి క్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహుని దర్శనార్ధం అశేష భక్తజనులు తరలివచ్చారు. కార్తీక పర్వదినాలు ముగియనున్నందున ఆదివారం కావడంతో అనేక ప్రాంతాలనుం చి భక్త జనులు అధికసంఖ్యలో రావడంతో యాదాద్రి కొం డతోపాటు కొండకింద పరిసర ప్రాంతాలు భక్తజనులతో కిక్కిరిసిపోయాయి.

స్వామివారి దర్శనాలు, శ్రీసత్యనారాయణ వ్రతాలు, ప్రసాద విక్రయ క్యూలైన్లు, పుష్కరిణి, మెట్ల మార్గం, రోడ్డు మార్గం ఇలా.. ఎటుచూసిన శ్రీవారి దర్శనార్ధం తరలివచ్చిన భక్తులతో యాదాద్రి క్షేత్రం భక్తులతో నిండిపోయింది. స్వామి దర్శనార్ధం తరలివచ్చిన భక్తులు తెల్లవారు జామునే పుణ్యసాన్నాలు ఆచరించి కార్తీక దీపారాధన, వత్ర పూజలు చేసి శ్రీవారి క్షేత్రంలో జరిగే నిత్య కైంకర్యాలైన సుప్రభాతసేవ, అర్చన, అభిషేకం, నిత్యకల్యాణం, సువర్ణ పుష్పర్చన, జోడి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకుని స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం కోసం దర్శదర్శన భక్తులకు సుమారు 4గంటలకుపైగా సమయం పట్టింది.

రికార్డు స్థాయిలో శ్రీవారి ఆదాయం

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి నిత్య రాబడి రికార్డు స్థాయిలో పెరుగుతుంది. కార్తీక మాసం కావడంతో శ్రీవారి దర్శనార్ధం తరలివచ్చిన భక్తుల వివిధ రూపాల్లో సమర్పించిన కానుకలు, ప్రసాదాలు ఇతర మార్గాల్లో ఆదివారం ఒక్కరోజే కోటి 16 లక్షల 14వేల ఆదాయం సమకూరింది.

ఆలయ చరిత్రలో మెట్టమెదటి సారిగా గత అదివారం సుమారు కోటి 10లక్షల రూపాయల ఆదాయం రాగా, నేడు మరో ఆరు లక్షల ఆదాయం అదనంగా స్వామివారి ఖజానాకు జమ అయ్యిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ప్రసాద విక్రయం ద్వారా రూ.44,37,150, విఐపి దర్శనాల ద్వారా రూ.18,90,000, వ్రత పూజల ద్వారా రూ.15,20,00, కొండపైకి వాహన అనుమతించడం ద్వారా రూ.9,75,000, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.9,75,000తోపాటు వివిధ మార్గాల్లో ఈ మొత్తం ఆదాయం స్వామికి ఆదాయం సమకూరినట్టు ఆలయ అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News