Friday, January 24, 2025

పలు ఆలయాలకు పోటెత్తిన భక్తులు

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/హైదరాబాద్ : కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో రాష్ట్రంలోని పలు ఆలయాలు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవురోజు కావడం, సోమవారం కార్తీకమాసంలో చివరిది కావడంతో భక్తుల రాకతో ఈ రెండురోజులు పలు ఆలయాలు భక్తుల రాకతో కిటకిటలాడాయి. ఈ నేపథ్యంలో ఆలయాలను అందంగా ముస్తాబుచేశారు. దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

వేకువ జాము నుంచి భక్తులు క్యూలైన్లలో బారులు తీరి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. పలువురు భక్తులు ఆలయం ఎదుట ఉన్న కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) భక్తులకు పంచిపెట్టారు. ఆలయ కళాభవన్‌లో సామూహిక సత్యనారాయణ వ్రతాలు పాల్గొన్నారు. అభిషేకం, అన్న పూజలు, కల్యాణ మొక్కులు, గండాదీపం మొక్కులు, సత్యనారాయణ వ్రతాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. దాదాపు 60వేల మంది భక్తులు రాజన్నను దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. వివిధ ఆర్జిత సేవల ద్వారా రూ.28లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

భక్తులతో కిటకిటలాడిన యాదాద్రి

కార్తీకమాసం చివరి వారం కావడంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. శివాలయం, కార్తీక దీపారాధన, వ్రత మండపాలతో పాటు కొండపై ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపించింది. కల్యాణకట్ట, పార్కింగ్ ఏరియా, బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు రద్దీగా మారాయి. దీంతో స్వామి వారి దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. భక్తులు కార్తీక దీపాలు వెలిగించుకోవడానికి కొండపైన ప్రధాన ఆలయ ప్రాంగణం, శివాలయం, విష్ణు పుష్కరిణి, కొండ కింద వ్రత మండపం, లక్ష్మీ పుష్కరిణి వద్ద దీపారాధన స్టాళ్లు ఏర్పాటు చేశారు. భక్తులు కుటుంబ సమేతంగా కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.

మరోసారి రికార్డు స్థాయి ఆదాయం..

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి ఆదివారం వివిధ కైంకర్యాల ద్వారా రూ.1,16,13,977ల ఆదాయం లభించింది. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 3,24,650, కైంకర్యాలు రూ.16,100, సుప్రభాతం రూ.10,300, ప్రతాలు రూ.15,20,000, ప్రచారశాఖ రూ.2,87,500, విఐపి దర్శనం రూ.18,90,000, యాదరుషి నిలయం రూ.1,92,500, ప్రసాద విక్రయం ద్వారా రూ.44,37,150, పాతగుట్ట రూ.3,78,670, కళ్యాణ కట్ట రూ.1,78,000, శాశ్వత పూజలు రూ.37,500. వాహన పూజలు రూ.31,200. కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ. 9,75,000, సువర్ణ పుష్పార్చన రూ.2.52,348, వేద ఆశీర్వచనం రూ.19,800, శివాలయం రూ.32,600, అన్నదానం రూ.55.659. బ్రేక్ దర్శనం టికెట్ల విక్రయం ద్వారా రూ.9.75,000లు ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News