యాదాద్రి భువనగిరి:శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శించుకున్న భక్తులు శ్రీవారి ఆలయంలో జరిగిన నిత్యపూజలలో పాల్గొన్నా రు. గురువారం తెల్లవారుజామున సుప్రభాత సేవతో ఆలయాన్ని తెరిచిన అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, అభిషేకం, అర్చన, సుదర్శన నారసింహ హోమం, స్వామివారి నిత్యకల్యాణ మహోత్సవం, సువర్ణ పుష్పార్చన, వెండి జోడి సేవ, దర్బార్ సేవతో పాటు పలు నిత్యకైంకర్య పూజలను అర్చకులు నిర్వహించారు.
వివిధ ప్రాంతాలనుండి కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు స్వామివారి నిత్యపూజల్లో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. కొండపైన కొలువుదీరిన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో కూడా భక్తులు దర్శించుకున్నారు. కొండ కిందగల అనుబంధ ఆలయమైన శ్రీపాత లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయ నిత్యరాబడి..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యరాబడి రూ.13,62,088 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ రూ.75,300, వీఐపీ దర్శనం రూ.90,000, బ్రేక్ దర్శనం రూ.59,700, ప్రసాద విక్రయం రూ.5,80,700, కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ.2,00,000 తో పాటు వివిధ శాఖల నుంచి స్వామివారికి నిత్యరాబడి చేకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.