Thursday, January 23, 2025

యాదగిరీశుడి నిత్యపూజలలో భక్తులు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి : శ్రీలక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రంలో ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని శ్రీ స్వామిఅమ్మవారులకు వైభవంగా లక్ష పుష్పార్చన పూజను నిర్వహించారు. బుధవారం ఉదయం ఆలయంలో సుప్రభాత సేవ, అర్చన, అభిషేకం, సుదర్శన నారసింహ హోమం పూజలతో భక్తులకు సర్వదర్శనాలు కల్పించారు. ఏకాదశి పురస్కరించుకొని ఆలయ ముఖమండపంలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారికి అలంకరించి రంగు రంగుల పరిమళముగల వివిధ రకాల పుష్పాలతో వైభవంగా లక్ష పుష్పార్చన పూజలను అర్చకులు నిర్వహించారు.

శ్రీలక్ష్మీనరసింహ స్వామి యా దాద్రి క్షేత్రంలో వేదోక్తంగా నిత్యపూజలను ఆలయ అర్చకులు నిర్వహించారు. శ్రీవారి దర్శనానికి కుటుంబ సభ్యులతో, పిల్లాపాపలతో కలిసి వచ్చిన భక్తులు శ్రీలక్ష్మీనరసింహుని దర్శనము తో పాటు, ని త్యకల్యాణం, సువర్ణ పుష్పార్చన, సుదర్శన నారసింహ హోమం, వెం డి జోడి సేవ, శ్రీసత్యనారాయణ వ్రతపూజలలో పాల్గొని తమ మొ క్కుబడులను చెల్లించుకున్నారు. కొండపైన అనుబంధ ఆలయమైన శ్రీపర్వతవర్ధిణీ సమేత శ్రీరామాలింగేశ్వర స్వామి శివాలయంలో భక్తులు శివ దర్శనము చేసుకొని పూజలు నిర్వహించారు. కొండకి ంద అనుబంధ ఆలయం శ్రీపాతలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని కూడ భక్తులు సందర్శించి ఆలయ నిత్యపూజలలో పాల్గొని శ్రీవారి దర్శించుకున్నారు.

ఆలయ నిత్యరాబడి..
స్వామివారి ఆలయ నిత్యరాబడిలో భాగంగా బుధవారం రూ.24,10,359 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాద విక్రయం ద్వారా రూ.8,99,100, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.2,79,750, బ్రేక్ దర్శనం ద్వారా రూ.1,64,400, వీఐ పీ దర్శనం ద్వారా రూ.75,000, సువర్ణ పుష్పార్చన రూ.76,800, కొండపైకి వాహనాల అనుమతి ద్వారా రూ.3,00,000, తదితర శాఖల నుండి ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.

స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు..
స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆ క్వా డెవలప్ మెంట్ అధారిటి వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్,తెలంగాణ ఉపలోకయుక్త నిరంజన్ రావులు శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయగా ఆలయ అర్చకులు ప్రముఖులకు ఆశీర్వచనము, తీర్ధప్రసాదములు అందచేశారు.

గోపూజ, హరితహారం..
తెలంగాణ ఆవిర్బావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా యాదాద్రి దేవస్థానమ ఆధ్వర్యంలో గోపూజ, హరితహారం కార్యక్రమాలను నిర్వహించారు. దేవస్థానము ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో కొండ కిందగల గోశాలలో ముందుగా గోపూజ లు చేశారు. అనంతరం గోశాల ఆవరణలో చెట్ల మోక్కలను నాటి హరితహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటి ఈవో భాస్కర్ శర్మ, ఏఈవులో రామోహన్, శ్రావాణ్, రఘు,రమేష్ ఆలయ అధికారులు, ఉద్యోగ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News