యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న భక్తజనులు శ్రీవారి ఆలయంలో జరుగు నిత్యపూజలలో పాల్గొని తమ మోక్కుబడులను చెల్లించుకున్నారు. శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయం తెరిచిన ఆర్చకులు సుప్రభాత సేవతో ఆలయ పూజలకు శ్రీకారం చుట్టారు. శ్రీ స్వామివారి దర్శనార్ధం తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుండే యాదాద్రి కొండకు చేరుకొని శ్రీ వారి దర్శనముతోపాటూ ఆలయంలో జరిగిన నిత్యపూజలు అభిషేకం, అర్చన, సుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యానం,సువర్ణ పుష్పార్చన.
వెండి జోడిసేవ, దర్బార్ సేవ తోపాటూ శ్రీవారి సేవలో జరుగు శ్రీ సత్యనారాయణ వ్రతపూజలలో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. కొండపైన కొలువుదీరిని శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి శివాలయంలో శివ దర్శనముతో పాటు, కొండకింద శ్రీపాతలక్ష్మీనరసింహుని భక్తులు దర్శించుకొని పూజలు నిర్వహించారు.
శివాలయంలో నవగ్రహాలకు శని త్రయోదశి పూజలు
స్వామివారి కొండపైన కోలువుదీరిన శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి శివాలయంలో గల నవగ్రహాలకు శని త్రయోదశి పూజలను నిర్వహించారు. శనిత్రయోదశి పర్వదిన సందర్బంగా ఆలయ అర్చకులు శాస్రోక్తంగా పూజలు చేయగా భక్తులు పాల్గోని దర్శించుకున్నారు.
ఆలయ నిత్యరాబడి..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిత్యరాబడి లో భాగ ంగా శనివారం రూ. 20,02,774 ఆదాయం వచ్చిన ట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాద విక్రయం,అర్జిత సేవలు,విఐపి దర్శనము,కొండపైకి వాహనాల అనుమతి, పాతగుట్ట, శివాలయం ఇతర శాఖల నుండి ఆలయ నిత్యరాబడి సమకురినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
స్వామివారిని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుటుంబ సమేతంగా దర్శి ంచుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ దంపతులకు ఆలయ అర్చకులు ఆశీర్వచనము చేయగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.