Thursday, January 23, 2025

యాదాద్రి నిత్యపూజలలో భక్తులు

- Advertisement -
- Advertisement -

శ్రీవారి నిత్యరాబడి రూ. 15.78 లక్షలు

మనతెలంగాణ/యాదాద్రి: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రంలో జరుగు నిత్యపూజలలో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరచిన అర్చకులు సుప్రభాత సేవ, అభిషేకం, అర్చన, పుష్పాలంకరణ పూజ సేవలు నిర్వహించారు. ఉదయం సుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, దర్బార్ సేవ, సాయంకాలం జోడి సేవ పూజలతో పాటు ఆలయంలో సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

నిత్యరాబడి….

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యాదాద్రి క్షేత్రంలో స్వామివారి ఆలయం నిత్యరాబడి భాగంగా బుధవారం రోజున 15 లక్షల 78 వేల 448 రూపాయలు అనుబంధ ఆలయమైన పాతగుట్ట దేవాలయం, వివిధ శాఖల నుండి స్వామివారి నిత్యరాబడి సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News