Wednesday, January 22, 2025

యాదాద్రి నిత్యపూజలో భక్తులు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి:యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శించుకున్న భక్తులు ఆలయంలో జరిగిన నిత్యపూజలలో పాల్గొన్నారు. బుధవారం తెల్లవారుజామున సుప్రభాత సేవతో ఆలయాన్ని తెరిచిన అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, అభిషేకం, అర్చన, సుదర్శన నారసింహ హోమం, స్వామివారి నిత్యకల్యాణ మహోత్సవం, సువర్ణ పుష్పార్చన, వెండి జోడి సేవ, దర్బార్ సేవతో పాటు పలు ని త్యకైంకర్య పూజలను అర్చకులు నిర్వహించారు.

స్వామివారి నిత్యపూజల్లో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. కొండపైన కొలువుదీరిన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో కూడా భక్తులు దర్శించుకున్నారు. కొండ కిందగల అనుబంధ ఆలయమైన శ్రీపాత లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

ఆలయ నిత్యరాబడి…
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యరాబడి రూ.11,43,913 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ రూ.80,950, వీఐపీ దర్శనం రూ.60,000, బ్రేక్ దర్శనం రూ.92,100,, ప్రసాద విక్రయం రూ.5,30,920, కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ.1,50,000తో పాటు వివిధ శాఖల నుంచి స్వామివారికి నిత్యరాబడి చేకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

శ్రీ స్వామివారిని దర్శించుకున్న బిసి కమిషన్ చైర్మన్..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుని సన్నిధిలో బీసి కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా యా దాద్రి శ్రీలక్ష్మీనరసింహుని దర్శించుకన్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ స్వామివారిని దర్శించుకున్న బీసి కమిషన్ చైర్మన్ను ఆలయ అర్చకులు ఆశీర్వచనము చేయగా, ఆలయ అధికారి ప్రసాదమును అందచేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పరమ పవిత్రమైన సన్నిదిలో గడిపే ఆవకాశం పూర్వజన్మ సుకృత్రంగా భావిస్తున్నని అన్నారు. కృష్ణ శిలతో యాదాద్రి ఆలయం పునఃనిర్మానం చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్నారు ఆన్నారు. ఆయన వెంట దర్శనములో జాతీయ బీసి దళ్ అధ్యక్షుడు దుండ్రు కుమారస్వామి,దివ్య డైమాండ్ అదినేత మహెంద్రబాబు, అయాన్,అనిల్,శ్రీనివాస్ ఉండగా అర్డిఓ అమరెందర్,బిసి సంక్షేమ అధికారి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News