Friday, December 27, 2024

యాదాద్రి నిత్యపూజలో భక్తులు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి:శ్రావణమాసం ప్రారంభం కావడంతో శ్రీలక్ష్మీనరసింహుని దర్శనానాకి తరలి వచ్చిన భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకుని ఆలయ నిత్యపూజలలో భక్తులు పాల్గొన్నారు. గురువారం శ్రావణ మాసం మొదిటి రోజున తెల్లవారు జామున ఆలయం తెరిచిన అర్చకులు సుప్రభాత సేవ, అభిషేకం, అర్చన, సుదర్శన నారసింహ హోమం, స్వామివారి నిత్యకల్యాణ మహోత్సవం, సువర్ణ పుష్పార్చన, వెండి జోడి సేవ, దర్బార్ సేవతో పాటు పలు నిత్యకైంకర్య పూజలను అర్చకులు నిర్వహించారు. శ్రావణమాసం సందర్బంగా శ్రీ అండాలమ్మకు ప్రత్యేక పూజలను గావించారు.

శ్రీలక్ష్మీనరసింహుని దర్శించుకున్న భక్తు జనులు ఆలయ నిత్యపూజలలో పాల్గొని తమ మోక్కుబడులు చెలించుకున్నారు.కొండపైన శివాలయంలో శివదర్శనం చేసుకున్న భక్తులు, కొండకింద శ్రీ పాతలక్ష్మీనరసింహ స్వామివారి దర్శనముకూడ చేసుకుని పూజలను నిర్వహించారు.

హరినామ సంకీర్తనలు ప్రారంభం..
శ్రావణమాసం పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక కుంకుమర్చన పూజలు నిర్వహించంతోపాటూ… శ్రీవారి సన్నిధిలో తోలి సారి శ్రామణమాస హరినామ సంకీర్తనల భక్తి భజన కీర్తనల ఆలపన చేయుటకు సంగీత వేదికను ప్రారంభించారు. ఉదయం ఆలయ ఆవరణ పరిదిలో చేపట్టిన హరినామ సంకీర్తనల కార్యాక్రమాని ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రరంభించారు. ఆలయ చైర్మన్ నర్సింహ్మమూర్తి పాల్గొని మాట్లాడుతూ భక్తులను ఆలరించెందుకు శ్రావణమాసం సందర్బంగా భజన మండలి వారిచే భక్తి కీర్తనలు ఆలపించెందుకు హరినామ సంకీర్తనల వేదికను ప్రారంభించడం జరిగిందని భక్తులు, భజనమండిలి సభ్యులు పాల్గొని స్వామి సేవలో కృపకు పాత్రులు కాగలని కోరారు.

నేడు అమ్మవారికి కుంకుమార్చన పూజ..
యాదాద్రి క్షేత్రంలో శ్రావణమాసంలో అమ్మవారికి జరుపు ప్రత్యేక పూజలో భాగంగా మాసంలోని నాలుగు శుక్రవారాలలో శ్రీవరలక్ష్మ, అండాలమ్మలకు కుంకమర్చన పూజలను నిర్వహించనున్నారు. శ్రావణమాసం తోలి శుక్రవారం నేడు కావడంతో అమ్మవారికి కుంకుమార్చన ప్రత్యేక పూజలను ఆలయ ఆవరణలో చేపట్టునున్నారు. కుంకుమార్చనలో పాల్గొనే భక్తులు పూజటిక్కెటును పొంది పూజలో పాల్గొనవలసిందిగా ఆలయ అధికారులు తెలిపారు.

శ్రీవారి నిత్యరాబడి..
శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యాదాద్రి క్షేత్రంలో స్వామివారి ఆలయం నిత్యరాబడి భాగంగా గురువారం రోజున రూ.12,40,768 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. నిత్యరాబడిలో అనుభంద ఆలయమైన పాతగుట్ట దేవాలయం, వివిధ శాఖల నుండి స్వామివారి నిత్యరాబడి సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News