Monday, January 20, 2025

యాదాద్రి నిత్యపూజలలో భక్తులు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో భక్తులు నిత్యపూజలలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఆలయంలో సుప్రభాత సేవతో పూజలు ప్రారంభించిన అర్చకులు అర్చన, అభిషేకం అనంతరము భక్తులకు సర్వదర్శనాలు కల్పించారు. శ్రీవారి దర్శనానికి కుటుంబ సభ్యులతో, పిల్లాపాపలతో కలిసి వచ్చిన భక్తులు శ్రీలక్ష్మీనరసింహుని దర్శనంతో పాటు, నిత్యకల్యాణం, సువర్ణ పుష్పార్చన, సుదర్శన నారసింహ హోమం, వెండి జోడి సేవ, శ్రీసత్యనారాయణ వ్రతపూజలలో పాల్గొని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు.

కొండపైన అనుబంధ ఆలయమైన శ్రీపర్వతవర్ధినీ స మేత శ్రీరామలింగేశ్వర స్వామి శివాలయంలో భక్తులు శివ దర్శనము చేసుకొని పూజలు నిర్వహించారు. కొండకింద అనుబంధ ఆలయం శ్రీపాతలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని కూడా భక్తులు సందర్శించి నిత్యపూజలలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

ఆలయ నిత్యరాబడి..
స్వామి ఆలయ నిత్యరాబడిలో భాగంగా బుధవారం రూ.14,15,972 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్ర సాద విక్రయం ద్వారా రూ. 6,51,750, ప్రధాన బుకింగ్ ద్వారా 1,25,700, బ్రేక్ దర్శనం ద్వారా రూ.1,06,200, కొండపైకి వాహనాల అనుమతి ద్వారా రూ.2,50,000, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.99,948, వీఐపీ దర్శనాల ద్వారా రూ.30,000, నిత్యపూజలు తదితర శాఖల నుండి ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

స్వామివారిని దర్శించుకన్న విక్టోరియా సలహాదారుడు సాయిని రాజ్ కుమార్
స్వామి వారిని ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర శాంతి న్యాయమూరి, సలహాదారునిగా వ్యవహరిస్తున్న డాక్టర్ సాయిని రాజ్ కుమార్ దర్శించుకున్నారు. ఆస్ట్రేలియకు 15 సంవత్సరాలక్రితం చుదువుకోవడానికి వెళ్లిన తాను అక్కడి రాజకీయాలో చురుకుగా పాల్గొని ఉన్నత స్థాయికి చేరడం జరిగిందని తెలిపారు. కుటుంబ సమేతంగా శ్రీ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News