యాదాద్రిభువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో భక్తులు నిత్యపూజలలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఆలయంలో సుప్రభాత సేవ తో పూజలు ప్రారంభించిన అర్చకులు అర్చన, అభిషేకం అనంతర ము భక్తులకు సర్వదర్శనాలు కల్పించారు. శ్రీవారి దర్శనానికి కు టుంబ సభ్యులతో, పిల్లాపాపలతో కలిసి వచ్చిన భక్తులు శ్రీలక్ష్మీనరసింహుని దర్శనంతో పాటు, నిత్యకల్యాణం, సువర్ణ పుష్పార్చన, సుదర్శన నారసింహ హోమం, వెండి జోడి సేవ, శ్రీసత్యనారాయణ వ్రతపూజలలో పాల్గొని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు.
కొ ండపైన అనుబంధ ఆలయమైన శ్రీపర్వతవర్ధినీ సమేత శ్రీరామలింగేశ్వర స్వామి శివాలయంలో భక్తులు శివ దర్శనం చేసుకొని పూ జలు నిర్వహించారు. కొండకింద అనుబంధ ఆలయం శ్రీపాతలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని కూడా భక్తులు సందర్శించి నిత్యపూజలలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయ నిత్యరాబడి..
శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిత్యరాబడిలో భాగంగా బుధవారం రూ.15,31,145 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాద విక్రయం ద్వారా రూ. 6,36,300, ప్రధాన బుకింగ్ ద్వారా 1,37,900, బ్రేక్ దర్శనం ద్వారా రూ.1,79,700, కొండపైకి వాహనాల అనుమతి ద్వారా రూ.2,50,000, సువర్ణ పు ష్పార్చన ద్వారా రూ.1,01,580, వీఐపీ దర్శనాల ద్వారా రూ .45,000, నిత్యపూజలు తదితర శాఖల నుండి ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.