Monday, January 20, 2025

యాదాద్రీశుడి దర్శనానికి పెరిగిన భక్తులు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి:ప్రసిద్ధి క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసి ంహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. కొద్దిరోజులుగా స్వామి వారి దర్శనార్ధం భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నప్పటికీ విద్యాసంస్థలకు వరుస సెలవులు రావడంతో రెండు రోజులుగా స్వామివారి దర్శనార్ధం కుటుంబ సభ్యులు, పిల్లాపాపలతో కలిసివస్తున్న భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో పూజా కైంకర్యాలు ప్రారంభించారు.

ఉదయం అ ష్టోత్తరం, అభిషేకం, నిత్యకల్యాణం, సు వర్ణపుష్పార్చనతో పాటు శ్రీసత్యనారాయణస్వామి వ్రతపూజ, సాయ ంత్రం వెండి జోడి మొక్కు సేవలో భక్తులు పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. శ్రీలక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న భక్తులు కొండపైన కొలువైన శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.యాదాద్రి అనుబంధ క్షేత్రమైన శ్రీపాతలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని కూడా భక్తులు సందర్శి ంచి తమ మొక్కులను తీర్చుకున్నారు.

ఆలయ నిత్యరాబడి..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నిత్యరాబడిలో భాగం గా ఆదివారం రూ.28,00,324 ఆదాయం వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాద విక్రయం ద్వారా రూ.11,25,400, ప్ర ధాన బుకింగ్ ద్వారా రూ.2,78,500, వీఐపీ దర్శనం ద్వారా రూ.2,10,000 లక్షలు, బ్రేక్ దర్శనం ద్వారా రూ .2,69,400, కొం డపైకి వాహనాల అనుమతి ద్వారా రూ.3,50,000 లక్షలతో పాటు వివిధ శాఖల నుంచి ఆలయానికి నిత్యరాబడి సమకూరినట్టు అధికారులు తెలిపారు.

శ్రీవారి సేవలో ప్రముఖులు..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదివారం స్వామివారిని దర్శించుకున్నవారిలో తెలంగాణ డైరెక్టర్ ప్రాసిక్యూషన్స్ వైజయంతి, ఐజీ తరుణ్‌జోషి ఉన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన వారికి అర్చకులు వేదాశీర్వాదం చేశారు. ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News